Thursday, March 12, 2026

బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం స్థలం కబ్జాపై ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్పందన

నేటి సాక్షి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 14 : మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న బేడ బుడగ జంగం స్థానిక సంక్షేమ సంఘం స్థలంను కాంగ్రెస్ నాయకుడు కమోజీ తిరుపతయ్య కబ్జా చేసినట్టు సంఘం సభ్యులు ఆరోపించారు.సంఘానికి చెందిన స్థలంలో డబ్బాలు ఏర్పాటు చేయడంతో, వాటిని తొలగించాలని పలుమార్లు కోరినా స్పందించకుండా తిరుపతయ్య ఇది నా స్థలం, ఏం చేసుకుంటారో చేసుకోండి అని బెదిరింపులకు దిగారని వారు పేర్కొన్నారు.ఈ విషయంపై సంఘం సభ్యులు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వెంటనే ఎమ్మార్వోతో మాట్లాడి, ఆ స్థలంపై ఏర్పాటైన డబ్బాలను తొలగించి సంఘం సభ్యులకు తిరిగి అందజేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి, భూపేష్ గౌడ్, సిద్దాల బీరప్ప, శ్రీను నాయక్, సంఘం అధ్యక్షులు పవన్ కుమార్ మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News