నేటిసాక్షి, మిర్యాలగూడ : ఎస్సీ సామాజిక వర్గంలో బైండ్ల కులస్తులకు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత కల్పించాలనిపురుషోత్తం అన్నారు. నియోజకవర్గ పరిధిలోని వేములపల్లి మండలం సలుకునూరు గ్రామానికి చెందిన కందుకూరి పురుషోత్తం (తండ్రి జగన్నాథం) ను బైండ్ల కుల పెద్దమనిషిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కందుకూరి పురుషోత్తం మాట్లాడుతూ, బైండ్ల కుల వృత్తి చేసుకుంటూ జీవనం సాగించే బైండ్ల వారు గ్రామ దేవతల పండుగలు చేస్తూ, గ్రామాలలో బొడ్రాయి, మైసమ్మ, మారెమ్మ, ఎల్లమ్మ, గ్రామ దేవతలను పూజించే కులానికి, చెందిన బైండ్ల వారికి, తగిన గుర్తింపు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో బైండ్ల వారిని ప్రత్యేకంగా గుర్తించి, సంక్షేమ పథకాలలో తగిన అవకాశాలు కల్పించాలని అన్నారు. గ్రామాలలో బైండ్ల కులం వారికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రత్యేక నిధులను కేటాయించి వారికి కావలసిన పనిముట్లను సబ్సిడీ ద్వారా అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కందుకూరి సుదర్శన్, 5వ వార్డ్ మెంబర్ కందుకూరి వీటీ, వల్లపు దాసు రమేష్, కారంపూడి శ్రీనివాస్, వేణు, శ్యామ్, లక్ష్మి నారాయణ, శ్రవణ్, చంద్రశేఖర్, శ్రీనివాస్, ఆర్ఎంపి శ్రీనివాస్, కే శ్రీను జగదీష్, శ్రీకాంత్, భాను చందర్ భూపాల్, మంజునాథ్, ప్రేమ్ కుమార్, పడిసిరి మధుసూదన్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.





