నేటి సాక్షి 03 పాములపాడు :–కర్నూలు లోని బైరెడ్డి. రాజశేఖరెడ్డి నివాసంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. స్వీట్లు, పండ్లు, ఇచ్చి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.అంతేకాకుండా పూల మాలలతో శాలువాతో బైరెడ్డి రాజశేఖరరెడ్డి కి లింగాల నవీన్ గౌడ్ సన్మానించడమైనది. రాజకీయాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా స్నేహపూర్వకంగా మానవత్వం తో సుఖసంతోషాలతో అందరూ కలిసి మెలసి ఉండాలని మా లీడర్ మాజీ ఎమ్మెల్యే. బైరెడ్డి. రాజశేఖర్ రెడ్డి కి ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని నవీన గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు.మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి. మాట్లాడుతూ ఈ నూతన 2026 వ సంవత్సరం అందరి కుటుంబాలలో సంతోషం నింపాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకులు బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. గురువారం కర్నూలు బైరెడ్డి రాజశేఖరరెడ్డి స్వగృహంలో 2026 వ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. నంద్యాల, పాణ్యం, శ్రీశైలం, నందికొట్కూరు, డోన్, బనగానపల్లె నియోజకవర్గాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బైరెడ్డి అభిమానులు అధిక సంఖ్యలో గజ మాలలు, అందమైన పూల బొక్కేలు, వివిధ రకాల పండ్లతో తరలివచ్చి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి బాటలో పయనించాలని, సీఎం చంద్రబాబుతో రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని, ఈ ఏడాది అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నానని బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు.

