నేటి సాక్షి – కథలాపూర్*( రాధారపు నర్సయ్య )కథలాపూర్ మండలంలోని బొమ్మెన గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన బాలె లాస్య, బాలె కళావతి, బాలె లలిత కుటుంబాల వారు ఇతర పనుల నిమిత్తం మరో గ్రామానికి వెళ్లగా, ఇళ్లు తాళాలు వేసి ఉన్నట్లు గమనించిన దొంగలు ఇదే అదునుగా భావించి వారి ఇళ్ల తాళాలను పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది.*బంగారం, వెండి ఆభరణాల అపహరణ*దొంగతనంలో భాగంగా బాలె లాస్య ఇంటిలో ఉన్న మూడున్నర తులాల బంగారు ఆభరణాలు, మూడు తులాల వెండి ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. మిగతా రెండు ఇళ్లలోనూ ఇంటి సామగ్రిని చిందరవందరగా వేసి విలువైన వస్తువుల కోసం గాలించినట్లు సమాచారం. ఇంటి యజమానులు తిరిగి వచ్చి తాళాలు పగిలి ఉండటాన్ని గమనించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. దొంగల ఆచూకీ కోసం దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. వరుసగా మూడు ఇళ్లలో దొంగతనం జరగడంతో బొమ్మెన గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకొంది. రాత్రి వేళల్లో గస్తీ పెంచాలని గ్రామస్తులు కోరుతున్నారు.—

