నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి.శ్రీకాంత్)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని నాదర్గుల్ గ్రామంలో కాసు బాగ్ రైతులు నిర్వహించినటువంటి ఆది పోచమ్మ తల్లి బోనాల ఉత్సవానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ అందెల శ్రీరాములు హాజరై గ్రామస్తులు మరియు రైతులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్పొరేషన్ లోని మల్లికార్జున నగర్ లోనిర్వహించినటువంటి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ ఆ శక్తి స్వరూపిణి కరుణాకటాక్షం మహేశ్వరం నియోజకవర్గ ప్రజలందరిపై ప్రసరించాలని ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు పోరెడ్డి జగన్ మోహన్ రెడ్డి, మంత్రి మహేష్, తుక్కుగూడ మున్సిపాలిటీ మాజీ బిజెపి అధ్యక్షుడు రచ్చ లక్ష్మణ్, మర్రి ప్రభాకర్ రెడ్డి, శశిధర్ రావు, రంగారెడ్డి జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు చింతల రాఘవేందర్ ముదిరాజ్, పోరెడ్డి నితిన్ రెడ్డి, సామ నిషికాంత్ రెడ్డి, మనీష్ ముదిరాజ్, జెడి పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.