నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి డిసెంబర్ 19 ప్రముఖ పుణ్యక్షేత్రం, అమ్మలగన్న అమ్మ బోయకొండ గంగమ్మకు శుక్రవారం రాహుకాల అభిషేకాన్ని సాంప్రదాయపద్ధంగా నిర్వహించారు.ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేక అభిషేకము అలంకరణ నిర్వహించారు.అనంతరం రాహుకాల సమయంలో భక్తుల సమక్షంలో అమ్మవారిని అభిషేకించారు.రాహుకాల అమ్మవారిని అభిషేకించడం వల్ల లోకం సుభిక్షంగా ఉంటుందన్న భక్తుల విశ్వాసం దీంతో అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు.దేవస్థానం ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం ఆలయ అధికార సిబ్బంది భక్తులకు సేవలు అందించారు.





