నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి జనవరి 8ఆంధ్ర రాష్ట్రము, అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలము, దిగువపల్లి గ్రామములో ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానము నందు నేడు అనగా 08-01-2026న గురువారము జరిగిన హుండీ లెక్కింపు నందు దేవస్థాన ఆదాయం 31 రోజులకు గాను నగదు రూపంలో రూ. 48,85,165.00, బంగారు 000-19-000 గ్రాములు, వెండి 000-292-000 గ్రాములు, ఫారెన్ కరెన్సీ – 1) Central Bank of Sri Lanka (20 Rupees) – 1 Note మరియు శ్రీ రణభేరి గంగమ్మ దేవస్థానము ఆదాయం రూ. 28,943.00 వచ్చినవి. సదరు లెక్కింపునకు దేవస్థాన ఉప కమీషనరు & కార్యనిర్వహణాధికారి జె. ఏకాంబరం, చిత్తూరు జిల్లా, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమీషనరు శ్రీమతి K. చిట్టెమ్మ గారు, చౌడేపల్లి పోలీస్ సిబ్బంది, ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ – చౌడేపల్లి వారు మరియు దేవస్థాన అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

