Saturday, March 14, 2026

బోర్డర్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు పేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్….

నేటి సాక్షి నారాయణపేట, అక్టోబర్ 23,ఖరీఫ్ సీజన్ సందర్భంగా వరి ధాన్యాన్ని ఇతర రాష్ట్రాల నుండి నారాయణపేట జిల్లాలోకి రాకుండా 06బోర్డర్ చెక్పోస్ట్ లు ఏర్పాటు చేయడం జరిగిందని అక్కడ ఉండే పోలీస్, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉంటూ పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలి అని జిల్లా ఎస్పీ శ్రీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ గారు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ… కర్ణాటక రాష్ట్రం నుండి వరి ధాన్యం తెలంగాణ రాష్ట్రం, నారాయణపేట జిల్లాలోకి రాకుండా నారాయణపేట జిల్లా పరిధిలో 6 బార్డర్ చెక్పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని 1) జలాల్పూర్ చెక్ పోస్ట్, 2) కాన్కుర్తి చెక్ పోస్ట్, 3) కృష్ణ బ్రిడ్జ్ చెక్పోస్ట్, 4) చేగుంట చెక్పోస్ట్ 5) ఉజ్జల్లి చెక్పోస్ట్, 6) సమస్తాపూర్ చెక్ పోస్ట్లు దగ్గర ఉండే పోలీస్ రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించాలని తెలిపారు. అలాగే పిడిఎస్ రైస్ జిల్లా నుండి ఇతర రాష్ట్రాలకు తరలించకుండా పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. ప్రజలు, వ్యాపారస్తులు పోరుగు రాష్ట్రం నుంచి వచ్చే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయరాదని తెలిపారు. అలాగే పోలీసు అధికారులు బార్డర్ గ్రామాలపై నిఘా ఏర్పాటు చేసి వరి ధాన్యంతో ఉన్న వాహనాలు జిల్లాలోకి రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. ప్రతి వాహనాన్ని తనిఖీ నిర్వహించి వాహనాల నెంబర్లను రిజిస్టర్ లో నమోదు చేయాలని తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News