*నేటి సాక్షి,గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్):* గన్నేరువరం మండల పరిధిలోని గునుకుల కొండాపూర్ గ్రామంలో (వాలంటరీ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సొసైటీ) సంస్థ వారు సోమవారం సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ ఆధ్వర్యంలో బ్యాంకు సేవలు, ఆర్థిక అక్షరాస్యత సామాజిక భద్రత పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ కారణాల వల్ల క్లెయిమ్ చేయకుండా ఉన్న పొదుపు ఖాతాల గురించి వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం ఎస్ బివై, పీఎం జె జెబివై,ఏపీవై లను అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఎవరు కూడా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ల మోసాలకు గురి కావద్దని, సైబర్ నేరాల గురించి అవగాహన కలిగి ఉండాలని, ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే 1930 నంబర్ కి కాల్ చేయాలని, నకిలీ లింకులు, ఆన్లైన్ మోసాలు, డిజిటల్ అరెస్టులు గురించి అవగాహన కల్పించారు మరియు విడ్స్ సంస్థ క్యాలెండర్ ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు చుక్కల్ల లక్ష్మయ్య ,కొరివి నాగమ్మ , ఫీల్డ్ అసిస్టెంట్ హన్మండ్ల యాదగిరి, పంచాయతీ కార్యదర్శి ఎస్ బీఐ గునుకుల కొండాపూర్ బ్రాంచ్ మేనేజర్ వంశీధర్, మరియు విడ్స్ కౌన్సిలర్లు వినయ్, సురేందర్, నితిన్ , గ్రామస్తులు పాల్గొన్నారు.

