నేటి సాక్షి మండలంలోని కొండాపురం గ్రామంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆంజనేయ స్వామి గుడిలో కనివిని ఎరగని విధంగా ధూప దీప నైవేద్యాలు తో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు 1016 దీపాల తో గుడి ప్రాంగణంలో దీపాలంకరణ నిర్వహించారు అనంతరం సాయంత్రం ప్రముఖ గాయకుడు గట్టు నరేష్ భజన బృందంతో భజన కార్యక్రమం నిర్వహించి భక్తి శ్రద్దలతో కార్తీక పౌర్ణమి మొట్టమొదటిసారిగా గ్రామ పెద్దలు యువకుల సహకారంతో అద్భుతంగా నిర్వహించారు పూజారి దీవెనలు ఈ విధంగా ఆ పరమశివుని ఆశీస్సులు గ్రామం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని ఐక్యమత్యంతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఆదర్శ గ్రామంగా వెలుగొందుతోందని ఆశీర్వదించారు ఓం నమశ్శివాయ, శ్రీరామ జయరామ జయ జయ రామ, మృత్యుంజయ మంత్రము ఏకాత్మక మంత్రం పఠించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు , యువతి, యువకులు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు





