నేటి సాక్షి, నారాయణపేట, జూన్ 28,
నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల కేంద్రంలో భగత్ సింగ్ ఆటో యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవంగా శనివారం రోజు ఎన్నుకున్నారు. ఉప అధ్యక్షుడు రాము.నూతన కమిటీ గౌరవ అధ్యక్షులు ఎంఏ మసూద్. గౌరవ సలహాదారులుగా టప్ప కృష్ణయ్య. నీరటి ఉసేనప్ప. వి గోవర్ధన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికైన అధ్యక్షుడు గువ్వలపల్లి కొండన్న ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అందరి సహకారంతో ప్రభుత్వ అధికారులతో రాజకీయ పార్టీలకు అతీతంగా కలిసి ఉండి సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలు ఆటో డ్రైవర్లకు అందేలా మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. అలాగే ఆటో డ్రైవర్లకు సంవత్సరం కి 12 వేల రూపాయలను నగదు తో పాటు జీవిత బీమా సౌకర్యం కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేష్ సీనియర్ డ్రైవర్లు నీరటి అశోక్. కావాలి రాజు. పూజారి శ్రీరామ్. రఫీ తదితరులు పాల్గొన్నారు.





