నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)—————————-చిత్తూరు -12-12-25—————————-భద్రాచలం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్లో చిత్తూరు ఉమ్మడి జిల్లాకు చెందిన 9 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటన పై న్యూఢిల్లీ పార్లమెంటు శీతాకాల సమావేశాలకు హాజరైన చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు తక్షణం స్పందించారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్న చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ..,మృతులక కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు.





