నేటి సాక్షి :జిన్నారం
భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన బొల్లారంలో జరిగింది. బొల్లారం సిఐ రవీందర్ రెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 21న బొల్లారంలోని వైయస్సార్ కాలనీలో నివాసం ఉంటున్న గొల్ల గణేష్ కంటి సమస్యను తట్టుకోలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. భర్త మరణాన్ని తట్టుకోలేని భార్య అమరావతి (45) ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసుకొని ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తల మృతి పట్ల కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఈ విషయమై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ వివరించారు

