నేటిసాక్షి,గన్నేరువరం
జార్ఖండ్ వెళ్ళినప్పటి నుంచి భర్త తనతో సరిగ్గా మాట్లాడడం లేదని తీవ్ర మనస్థాపం చెందిన భార్య ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో జరిగింది. గన్నేరువరం ఏఎస్ఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.పత్తి మమత {27} దుర్గాప్రసాద్ దంపతులు వీరికి 11 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి 10 సంవత్సరాల కొడుకు ఉన్నాడు. రెండు నెలల క్రితం భర్త దుర్గాప్రసాద్ జార్ఖండ్ కు వెళ్ళాడు. జార్ఖండ్ కి వెళ్లినప్పటి నుంచి భర్త మాట్లాడడం లేదని, కుటుంబ పోషణ కొరకు పైసలు పంపడం లేదని తన తండ్రి టేకు జోగయ్యకు చెప్పి బాధపడేది. దీంతో నా జీవితం నాశనం అయ్యిందని తండ్రికి చెప్పి రోదించేది. ఈ క్రమంలో తీవ్ర పనస్థాపానికి చెందిన మమత సోమవారం తన రేకుల ఇంటిలో ఇనుప వైపుకు చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి టేకు జోగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ లక్ష్మీనారాయణ తెలిపారు.