నేటి సాక్షి 23 ఫిబ్రవరి జూపాడుబంగ్లా :—ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ కనస్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఫిబ్రవరి 23 వ తేదీన దేశవ్యాప్త నిరసన దినంలో భాగంగా ఏఐటీయూసీ బిల్డింగ్ యూనియన్ నాయకులు సలీమ్, సీపీఐ నాయకులు మాగబుల్ బాషా, పుల్లయ్య లు సోమవారం తహసీల్దార్ చంద్ర శేఖర్ నాయక్ కు వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతు దేశంలోని పలు రాష్ట్రాల్లో భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం 1996 అమలు జరుగుచున్నదని,అయితే చట్టం అమలు దేశవ్యాప్తంగా ఒకే పద్ధతిలో లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు.పార్లమెంటులో చట్టం చేసి మూడు దశాబ్దాలు గడిచినా కొన్ని రాష్ట్రాల్లో ఇంకా వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేయలేదన్నారు. వెళ్ఫర్ బోర్డులు ఏర్పాటు చేసిన రాష్ట్రాల్లో కూడా పని తీరు సక్రమంగా లేదన్నారు.. ఆంధ్రప్రదేశ్ లో 2019 నుండి వెల్ఫేర్ బోర్డు నిర్వీర్యం అయ్యిందన్నారు.వెల్ఫేర్ సెస్ వసూళ్లు కూడా సవ్యంగా లేవని,వసూలు చేసిన సెస్సును వెల్ఫేర్ బోర్డుకు జమ చేయడం లేదని,భవననిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం వసూలు చేసే వెల్ఫేర్ సెస్సును భవన నిర్మాణ కార్మికుల కోసం మాత్రమే ఖర్చు చేయాల్సి ఉందని వారు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు భవన నిర్మాణ సంక్షేమ బోర్డులోని నిధులను వేరే పథకాలకు దారి మళ్లిస్తున్నాయన్నారు.దేశంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం వసూలు చేసిన సెస్సులో దాదాపు 67వేల కోట్ల రూపాయలు సొమ్మును ఖర్చు చేయలేదని వెల్లడి అయ్యింది.ఈ పరిస్థితులను చక్కదిద్ది భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని వారు కోరారు. లేనిపక్షంలో ఆందోళన తప్పదన్నరు..

