బీజేపీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం.
జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి.
నేటి సాక్షి,నల్లబెల్లి జూన్ 22: భారతీయ జనతా పార్టీ తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని గ్రహించి బీజేపీ పార్టీలో పెద్ద ఎత్తున చేరుతున్నారని బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు.ఆదివారం బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు తడుక వినయ్ గౌడ్ అధ్యక్షతన మండల పార్టీ ఉపాధ్యక్షులు సింగిరెడ్డి యాదగిరి ఆధ్వర్యంలో నల్లబెల్లి మండలం ఆసరవెల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు 40 కుటుంబాలు డాక్టర్ గోగుల రానాప్రతాప్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు.పార్టీలో చేరిన వారందరికీ పార్టీ కండువాలు మెడలో వేసి పార్టీ లోకి ఆహ్వానించారు.ఈ సందర్బంగా రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.బిఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీల మోసపూరిత హామీలపై విసుగు చెంది రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రత్యాయమని గ్రహించి పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారన్నారు.
గతంలో ప్రభుత్వలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అమలు కానీ హామీలు ఇచ్చి మోసం చేస్తున్నా రెండు పార్టీలకు రాబోయే స్థానిక ఎన్నికల్లో బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధానకార్యదర్శి ఈర్ల నాగరాజు ,జిల్లా నాయకులు బచ్చు వెంకటేశ్వర్ రావు, పెరుమాండ్ల కోటి,వల్లే పార్వతలు,మండల కార్యదర్శి మర్రి నాగరాజు, సీనియర్ నాయకులు నాగిరెడ్డి రాజిరెడ్డి, యువమోర్చ నాయకులు తిమ్మాపురం శివ, దికొండ సునీల్. పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

