Tuesday, March 10, 2026

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మహేశ్వరం, కందుకూరు 12వ మండల మహాసభ


—— రంగారెడ్డి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య

నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం లో కేంద్రంలో ఎస్విజే కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారి, రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు , మహేశ్వరం నియోజకవర్గ కార్యదర్శి బి దత్తు నాయక్, సిపిఐ సీనియర్ నాయకులు పల్నాటి యాదయ్య, బాలాపూర్ కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, ముఖ్య అతిథులకు హాజరయ్యారు. మహేశ్వరం మండలం నూతన కమిటీ ఎన్నిక చేయడం జరిగింది. మండల కార్యదర్శి పి. దేవేందర్ గౌడ్, మండల సహాయ కార్యదర్శి డి.బ్రహ్మచారి 21 మంది కౌన్సిల్ సభ్యులు 9 మంది కార్యవర్గ సభ్యులు ఎన్నిక కావడం జరిగింది.
కందుకూరు మండలం నూతన కమిటీ కే.రాజు కందుకూరు మండల కార్యదర్శి 9 మంది కౌన్సిల్ సభ్యులు,5 మంది కార్యవర్గ సభ్యులు ఎన్నిక చేయడం జరిగింది.
కొత్తగా ఎన్నికైన మహేశ్వరం కందుకూరు కార్యదర్శిలకు మహేశ్వరం నియోజకవర్గ కమిటీ కార్యదర్శి బి దత్తు నాయక్ విప్లవ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేయడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News