Monday, March 23, 2026

*భారత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ చిత్ర పటం ఆవిష్కరణ*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)పుంగనూరు టౌన్ ఈస్ట్ పేట లో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాలు ఆవిష్కరణ జరిగింది ఈకార్యక్రమంలో భారతీయ అంబేద్కర్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులుపాలకుంట శ్రీనివాసులు పాల్గొన్నారు పుంగనూరు టౌన్, ఈస్ట్ పేట ప్రధాన కూడలిలో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాలు స్థానిక దళిత నాయకులు రాజన్న ఆధ్వర్యంలో భారతీయ అంబేద్కర్ సేన రాష్ట్ర అధ్యక్షులు ఉలగనాథన్ గణపతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలకుంట శ్రీనివాసులు,దొర స్వామి, భారతీయ అంబేద్కర్ సేన రాష్ట్ర అధికార ప్రతినిధి ముత్యాల మోహన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని రాసి దేశంలోని ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ,సమానత్వం, సౌబ్రాతృత్వం మరియు సాంఘిక, ఆర్థిక,రాజకీయ న్యాయాలు సమానంగా అందరికీ అందాలని కోరుకోవడం జరిగిందని అదే రకంగా సాంఘిక ఆర్థిక న్యాయం ద్వారా సమ సమాజం సాధించాలని, కుల నిర్మూలన ద్వారా సాంఘిక సమానత్వాన్ని, స్టేట్ సోషలిజం ( రాజ్యస్వామ్యం )ద్వారా ఆర్థిక సమానత్వాన్ని సాధించొచ్చు అని అంబేద్కర్ ఆలోచన అని దీని ప్రకారమే భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపకులు PTM శివ ప్రసాద్ గారు భారతీయ అంబేద్కర్ సేనని స్థాపించి సమతా సమాజం వైపు భారతీయ అంబేద్కర్ సేన కార్యాచరణలను ఏర్పాటు చేసుకొని కుల నిర్మూలన- బౌద్ధ సంస్కృతి విస్తృతి – సాంఘిక సమానత్వం, రాజస్వామ్యవాదం – రాజ్యాధికారం- ఆర్థిక సమానత్వం వీటి ద్వారా సమతా సమాజం వైపు భారతీయ అంబేద్కర్ సేన పోరాటం చేస్తుందని వీరు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఈరోజు భారతీయ అంబేద్కర్ సేన కమిటీ ఇంచార్జ్ లను ప్రకటించుకోవడం జరిగింది. పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జిగా మార్లపల్లి మనీ, పుంగనూరు మండలం ఇన్చార్జిగా గంగరాజు, టౌన్ ఇన్చార్జిగా రెడ్డప్ప ను ఎన్నుకోవడం జరిగింది వీరు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సిద్ధాంతం ప్రకారం పోరాటం చేస్తున్న భారతీయ అంబేద్కర్ సేన లో పనిచేయడం చాలా సంతోషం తెలియజేస్తూ భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ముస్లిం అగ్రకులంలో ఉన్న పేదలు పక్షాన నిలబడి పోరాటాలు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ అంబేద్కర్ సేన మదనపల్లి నియోజకవర్గం,మండల నాయకులు రవిశంకర్,వలసపల్లి రమణ, గంగాధర్, సింగర్ రెడ్డప్ప, జన, రెడ్డిప్రసాద్, గోపి, అనిల్, శంకరప్ప, కృష్ణప్ప, మంజులమ్మ ,వెంకటరమణ దళిత నాయకులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News