నేటి సాక్షి: తిరుపతి జిల్లా (బాదూరు బాల) ఇటీవల భారతదేశంలో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన కలిగించింది. ఈ దాడికి భారత ప్రభుత్వం దృఢమైన ప్రతిస్పందనగా ఆపరేషన్ సిందూర్ అనే సైనిక చర్యను విజయవంతంగా నిర్వహించింది. దేశం అంతటా ఈ చర్యను విజయోత్సవంగా అభినందించడమే కాక, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత దేశం తీసుకున్న నిశ్చయాన్ని చాటిచెప్పింది.ఈ నేపథ్యంలో, దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న విద్యావేత్తలు ఈ దాడికి సంబంధించి తమ అభిప్రాయాలను విశ్లేషణాత్మక వ్యాసాల రూపంలో వ్యక్తీకరించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం తీసుకుంటున్న దృఢ వైఖరిని వారు వివరంగా చర్చించారు.ఈ రచనలను సంకలనం చేసి, ప్రత్యేక గ్రంథంగా రూపొందించగా, ఆ పుస్తకాన్ని ఏబీఆర్‌ఎస్‌ఎం ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు ప్రొఫెసర్ వై.వి. రామిరెడ్డి మరియు రాష్ట్ర టెక్నికల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ డాక్టర్ ఎన్. బాలసుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు. ఈ పుస్తకం భారతదేశ ప్రజలలో దేశభక్తిని పెంపొందించడమే కాక, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏర్పడిన అఖండ ఐక్యతకు చిహ్నంగా నిలుస్తోంది.