Friday, March 20, 2026

భారత రాజ్యాంగం అంటే కేవలం గ్రంథo కాదు – కళ్యాణ్ భరత్

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవాన్ని YSRCP రాష్ట్ర విద్యార్థి విభాగ సంయుక్త కార్యదర్శి కళ్యాణ్ భరత్ ఆధ్వర్యంలో చౌడేపల్లి లోని వారి కార్యాలయం లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా MPTC శ్రీరాములు, పుంగనూరు నియోజకవర్గ SC విభాగ అధ్యక్షులు బ్యాంక్ రెప్ప పాల్గొన్నారుముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డా”బి. ఆర్ అంబెడ్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు,ఈ సందర్భంగా కళ్యాణ్ భరత్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం అంటే కేవలం గ్రంధం కాదు అనిరాజ్యాంగం ఎంతో గొప్పది అని అన్నారు. 140 కోట్ల జనాభాకు ప్రజాస్వామ్యం అందించింది అని భిన్నత్వంలో ఏకత్వం మన రాజ్యాంగం. ప్రాథమిక హక్కులు, లౌకిక వాదం మనకు రాజ్యాంగం నుంచి కల్పించబడ్డాయి అని మన రాజ్యాంగం ఎన్నో దేశాలకు ఆదర్శం గా ఉండటం భారతీయులు గా మనకు ఎంతో గర్వకారణం అన్నారు .ఈ మన భారత రాజ్యాంగం భారతీయుల ఆత్మ మరియు వారి జీవన గమనాన్ని ప్రతిబింబించే విలువైన సాధనం అని. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది అన్నారు . భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలను రాజ్యాంగం నిర్దేశించింది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటు, ఆయా వ్యవస్థల అధికారాలు, బాధ్యతలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో కూడా నిర్దేశిస్తుంది అన్నారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జునా,డిష్ సూరి, నాగేంద్ర,చాంద్ బాష తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News