Friday, March 20, 2026

*భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థుల మాక్ అసెంబ్లీ అద్భుతం – ఎమ్మెల్యే గళ్ళా మాధవి*

నేటి సాక్షి, గుంటూరు జిల్లా ప్రతినిధిభారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో నిర్వహించిన మాక్ అసెంబ్లీ కార్యక్రమం అత్యంత అద్భుతంగా జరిగిందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి అన్నారు.బుధవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసి ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూప్రభుత్వ–ప్రతిపక్ష ధోరణులను, అసెంబ్లీ వ్యవహార శైలిని కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించిన విద్యార్థులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగ విలువలను రాష్ట్రవ్యాప్తంగా ప్రతి విద్యార్థికి చేరువ చేసేలా ప్రయత్నాలు చేస్తున్న మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మాక్ అసెంబ్లీ వంటి విలువలు–విద్య కలయిక కార్యక్రమాలను ప్రతి ఏడాది విద్యార్థులతో నిర్వహించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్ తరాలు విలువలతో కూడిన రాజకీయ రంగంలోకి రావాలనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షకు ఈ మాక్ అసెంబ్లీ అద్దంపడుతోందని గళ్లా మాధవి గారు పేర్కొన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనే నైతిక విలువలు, ప్రాథమిక హక్కులపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన విషయాన్ని ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుర్తుచేశారు. తన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని, నేటి మాక్ అసెంబ్లీలో “నైతిక విలువలు – ప్రాథమిక హక్కులు” పుస్తకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు విడుదల చేసినందుకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి ధన్యవాదాలు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News