నేటి సాక్షి, బాపట్ల జిల్లా (బాపట్ల టౌన్)బాపట్ల పట్టణంలో శ్రీ ఛత్రపతి శివాజీ స్మారక సేవా సమితి వారి ఆధ్వర్యంలో భారీస్థాయిలో భారత్ ఏక్తా ర్యాలీ లో కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు పాల్గొన్నారు.బాపట్ల పట్టణం లో ఇంత పెద్ద ఎత్తున భారతదేశ ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150 వ జయంతి సందర్భంగా భారీస్థాయిలో భారత్ ఏక్తా ర్యాలీ నిర్వహించటం సంతోషదాయకం అని రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు తెలియ జేశారు. బాపట్ల పట్టణం లోని మున్సిపల్ హై స్కూల్ నుండి టౌన్ హాల్ వరకు జరిగిన ర్యాలీని బాపట్ల శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు ప్రారంభించగా, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సమాజసేవకులు, అనేక పాఠశాలల విద్యార్ధిని విద్యార్ధులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణంలో భారత్ ఏక్తా ర్యాలీ సందర్భంగా తిరంగా జెండాలు చేతబూని, భారత్ మాతకు జై నినాదాలతో హోరెత్తించారు. టౌన్ హాల్ ప్రాంగణంలో జరిగిన సభలో బీజేపీ బాపట్ల జిల్లా అధ్యక్షులు బంగారు బాబు తోపాటు పలువురు వక్తలు ప్రసంగించారు. రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా విడివిడిగా ఉన్న అనేక సంస్థానాలను భారతదేశంలో కలపటం వలన భారతదేశ సమైక్యతను కాపాడటంలో ప్రముఖ పాత్ర పోషించిన స్వాతంత్ర్య సమరయోధుడు ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని భారత్ ఏక్తా దివస్ గా జరుపుకుంటారు అని తెలియ జేసి, భారతీయులు అందరికి శుభా కాంక్షలు తెలియ జేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బంగారు బాబు, ప్రముఖ బీజేపీ నాయకులు మోహన్ గౌడ్, తిలక్, కోట్రా శివరామకృష్ణ, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరాజు, శర్మ, బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు పుట్టా ఆదిశేషా రెడ్డి, ఉపాధ్యక్షులు చలికొండ వెంకట కృష్ణారావు, జాయింట్ సెక్రెటరీ పీటా సారధి, సీనియర్ మాజీ సైనికులు డి వెంకటేశ్వర్లు, పసుపులేటి ప్రసాద్ మొదలగు మాజీ సైనికులు పాల్గొన్నారు.





