Saturday, March 14, 2026

*భారీ వర్షం తో పూరి గుడిసె కోల్పోయిన వారిని అన్ని విధాల ఆదుకుంటాం…* *ప్రభుత్వ ఎమ్మెల్యే డాక్టర్ థామస్* *పూరిగుడిసి కోల్పోయిన విజయమ్మ కు 50 వేల రూపాయల చెక్కును అందించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*ఎస్ఆర్ పురం* ముంథా తుఫాన్ భారీ వర్షంలో పూరిగుడిశా కోల్పోయిన వారందరినీ అన్ని విధాల ఆదుకుంటామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు మంగళవారం గంగాధర్ నెల్లూరు మండలం మొక్కల్తూరు గ్రామానికి చెందిన రాజేశ్వరి ఆమె పూరిగుడిశా వర్షానికి పడిపోయింది.. ఆమెకు 50 వేల రూపాయల చెక్కును అందించారు అలాగే ఎస్ఆర్ పురం మండలం పెద్ద తయ్యూరు గ్రామానికి చెందిన విజయ వర్షానికి పూరిగుడిశా పడిపోయింది ఆమెకు 50 వేల రూపాయలు చెక్కును ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అందించారు అలాగే శ్రీ నిధి ద్వారా 75 వేల రూపాయలు ఇవ్వాలని ఏపిఎం సంఘమిత్రకు ఎమ్మెల్యే తెలియజేశారు అలాగే ప్రభుత్వం ద్వారా విజయ కుటుంబానికి 90 వేల రూపాయలు త్వరలో అందిస్తాం అలాగే ఎన్టీఆర్ గృహకల్పన కింద ఇల్లూరు మంజూరు చేస్తాం విజయకు అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ ఎంఎల్ఏ డాక్టర్ థామస్ తెలిపారు… అనంతర పెద్ద ఉయ్యూరు దళితవాడలో త్రాగునీరు బోరు వద్ద నీరు కలుషితం అవుతుందని గ్రామస్తులు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ దృష్టికి తీసుకురావడంతో వెంటనే త్రాగునీరు కలుషితం లేకుండా ఓవర్ హెడ్ ట్యాంకు ద్వారా నీరు గ్రామానికి అందించాలని ఎంపీడీవో పంచాయతీ కార్యదర్శిని కే తెలియజేశారు మూడు వారాల్లో ఈ త్రాగునీటి సమస్య పరిష్కరించకపోతే చర్యలు తీసుకుంటామని అధికారులకు తెలిపారు అనంతరం జిఎంఆర్ పురం వాగును పరిశీలించారు భారీ వర్షానికి జిఎంఆర్ పురం వాగు దుస్థితికి చేరడంతో ఈ భారీ వర్షాల వల్ల వాగు పొంగి పొరడంతో రాకపోకలు అంతరాయం ఏర్పడింది అని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తేవడంతో వెంటనే బ్రిడ్జి ఏర్పాటుకు కృషి చేస్తాను ప్రత్యామ్నాయంగా తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ యుగంధర్,… మండల పార్టీ అధ్యక్షుడు జయశంకర్ నాయుడు, జిల్లా మహిళా అధ్యక్షురాలు అరుణ, మాజీ మహిళా అధ్యక్షురాలు ఇందిరమ్మ,జిల్లా కార్యదర్శి రాజశేఖర్ నాయుడు, సింగల్ విండో డైరెక్టర్ నాగరాజు,, కార్వేటినగరం సింగల్ విండో ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి, సాఫ్ట్వేర్ బాలు,పైనేని మురళి,పెనుమూరు మండల పార్టీ అధ్యక్షుడు రుద్రయ్య నాయుడు, గంగాధర్ నెల్లూరు మండల అధ్యక్షులు స్వామి దాస్ బాలాజీ నాయుడు రమేష్ నాయుడు,, శేఖర్ రాజు, తాసిల్దార్ లోకనాథ్ పిళ్ళై ఎంపీడీవో వనజ, విద్యుత్ శాఖ ఏఈ విజయ శేఖర్, హేమాద్రి, నాయకులు తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News