నేటి సాక్షి పాలేరు , అక్టోబర్ 25 :ఇటీవల కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న వరి పొలాలను శనివారం జిల్లా బీజేపీ నాయకుడు గుండా ఉపేందర్ రెడ్డి మండల కిసాన్ మోర్ఛ అధ్యక్షులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, బద్దం వెంకట రెడ్డి తో కలిసి పరిశీలించారు.. జక్కేపల్లి , పేరిక సింగారం రెవెన్యూ గ్రామాల పరిధిలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ.. కూసుమంచి మండల పరిధిలోని రైతులు వర్షాల కారణంగా కోలుకొని విధంగా నష్టపోయారు.పత్తి పంట, మిర్చి పంటలతో పాటు చేతికి వచ్చిన వరి పంట నేలమట్టం కావడంతో పెట్టిన పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కౌలు రైతులు ఎకరాకు నలభై వేల రూపాయల కౌలు, యాభై వేల రూపాయలు పైచిలుకు పెట్టుబడి పెట్టడం వలన వారు తీవ్రంగా నష్టపోయి అప్పులు ఊబిలోకి పోయారు అన్నారు..మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తక్షణమే స్పందించి సంబధిత అధికారులతో పంట నష్టం సర్వే చేయాలని, ప్రభుత్వం ఆదుకోవాలని, నష్టపోయిన పంటకు ఎకరాకు యాభై వేల రూపాయలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరంవ్యవసాయ అధికారిని రామడుగు వాణితో చరవాణి ద్వారా వర్షాలతో దెబ్బతిన్న వరి పొలాలను విషయము తెలియజేశారు.. వెంటనే స్పందించి భారీ వర్షాలతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించడం జరిగినది అని తెలిపారు. ఏఓ రామడుగు వాణి దెబ్బతిన్న పంట పొలాలను మరొకసారి ఉన్నత అధికారులతో కలిసి పర్యటించి నివేదిక అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. పంట నష్టపోయిన రైతులు బద్దం వెంకట రెడ్డి, అజ్మీరా మల్సూరు, రామిని శ్రీనివాస్ రెడ్డి, కొత్త రజనీకాంత్ రెడ్డి, బానోత్ నాగేశ్వర్ రావు రైతులు ఉన్నారు.





