గొల్లపల్లి మండల ఎమ్మార్వో వరంధన్
నేటి సాక్షి – జగిత్యాల జిల్లా స్టాఫర్
( గుండ ప్రశాంత్ గౌడ్ )
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారత్ చట్టాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని గొల్లపల్లి మండల ఎమ్మార్వో వరంధన్ కోరారు. బుధవారం రోజున గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామంలో భూభారతి మండల ఎమ్మార్వో వరంధన్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. భూ సమస్యలు భూభారతి కార్యక్రమంలో ఆయన వివరించారు. ఇట్టి కార్యక్రమాన్ని రాపల్లి గ్రామస్తులు రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో వరంధన్ ఆర్ ఐ అనూష గ్రామ పంచాయతీ కార్యదర్శి శేకర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు ఏయంసి డైరెక్టర్ కొక్కుల జలంధర్ విజయ్ మారపెల్లి అర్జున్ రాజేందర్ లచ్చయ్య గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

