హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
మండలాల్లో జరుగుతున్న భూభారతి రెవెన్యూ సదస్సుల నిర్వహణ, వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమీక్ష
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్
(సందెల రాజు)
జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఆర్డీవోలు, తహసీల్దార్లను ఆదేశించారు. హన్మకొండ జిల్లా లోని మండలాల్లో జరుగుతున్న భూభారతి రెవెన్యూ సదస్సుల నిర్వహణ, వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అప్లికేషన్లను భూభారతి పోర్టల్ లో ఆన్లైన్ చేయాలన్నారు. వచ్చిన సాదా బైనామా అప్లికేషన్లను విచారించి సిద్ధంగా ఉంచాలన్నారు. భూభారతి సదస్సులలో వచ్చిన అప్లికేషన్లను పరిష్కరించే చర్యల్లో భాగంగా తగినంత సిబ్బందిని కేటాయించాలన్నారు. ప్రతి అప్లికేషన్ను భద్రంగా భద్ర పరచాలన్నారు. అప్లికేషన్ తో పాటు దరఖాస్తుదారులు సమర్పించిన ఆధారాలను సరి చూసుకొని పరిష్కారానికి తదుపరి చర్యల నిమిత్తం పంపించాలన్నారు. వచ్చిన దరఖాస్తులలో కేటగిరీలుగా విభజించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎ. వెంకట్ రెడ్డి, భూమి కొలతలు శాఖ ఏడీ శ్రీనివాసులు, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ నారాయణ, తహసీల్దార్లు పాల్గొన్నారు.

