Monday, March 16, 2026

భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు 2 కోట్లు నష్టపరిహారం అందించాలి నడికుడ శివ *నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఐటీ పార్క్ భూములపై రైతులకు తగిన నష్టపరిహారం ఇవ్వాలి: నడికూడ శివ* *

( నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం నవంబర్ 06:)*రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలోని ఐటీ పార్క్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.2 కోట్లు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని మహేశ్వరం నియోజకవర్గం ఐఎన్ టీయూసి కార్మిక శాఖ అధ్యక్షుడు నడికూడ శివ డిమాండ్ చేశారు. కందుకూరు ఆర్డీవో సమక్షంలో జరిగిన రైతుల సమావేశంలో మాట్లాడుతూ, “రైతుల కష్టార్జిత భూములు ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం తీసుకుంటున్నప్పుడు వారిని నిర్లక్ష్యం చేయకూడదు. రైతులకు న్యాయమైన పరిహారం అందే వరకు పోరాటం కొనసాగుతుంది” అన్నారు. రైతుల హక్కులను కాపాడడానికి ఐఎన్ టీయూసి ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ సమస్యలను ఆర్డీవోకు వివరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News