Wednesday, April 8, 2026

*భూసార పరీక్షలతో శాస్త్రీయ సాగుకు ఊతం** గుల్లకోటలో మట్టి నమూనాల సేకరణ*

నేటి సాక్షి, ఎండపల్లి:* ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా గుల్లకోట రెవెన్యూ పరిధిలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో భూసార పరీక్షల కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఐదు మట్టి నమూనాలను సేకరించారు. సేకరించిన నమూనాలను మంగళవారం గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ గొల్లపెల్లి మల్లేష్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. భూసార పరీక్షలు రైతులకు ఎంతో ఉపయోగకరమని, భూమి పరిస్థితులకు అనుగుణంగా ఎరువులు వినియోగిస్తే దిగుబడులు పెరుగుతాయని తెలిపారు. ప్రతి రైతు తప్పనిసరిగా మట్టి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం మట్టి పరీక్షల కోసం సేకరించిన నమూనాలను కరీంనగర్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్‌ (STL)కు పంపించారు. ఈ పరీక్షల ద్వారా భూమి సారాన్ని అంచనా వేసి రైతులకు తగిన ఎరువుల వినియోగంపై సూచనలు అందించనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి లావణ్య, వార్డు సభ్యులు బిసగోని తిరుపతి, మూల ప్రశాంత్, మాజీ ఉపసర్పంచ్ బిసగోని శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు గోనె సంతోష్, లింగంపెల్లి లచ్చయ్య, ఉదయ్, మిట్ట నరేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News