నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి డిసెంబర్ 9భూసార పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక ఉన్నత పాఠశాలలో స్కూల్ సాయిల్ హెల్త్ కార్యక్రమంలో భాగంగా మట్టి నమూనా సేకరించు విధానంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా వనరుల కేంద్రం చిత్తూరు వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రసన్న ఈ మేరకు వారికి అవగాహన కల్పించారు మట్టి పరీక్షలు చేయించుకున్నాడం వల్ల భూమిలోని పోషక పదార్థాలు ఎలా ఉన్నాయి లోపాల గురించి తెలుస్తుందన్నారు దాన్నిబట్టి ఎరువులు వాడకం వలన ఎరువులపై పెట్టుబడి అదనపు ఖర్చు తగ్గించుకోవడంతోపాటు నేల ఆరోగ్యాన్ని కాపాడవచ్చునని తెలియజేశారు విద్యార్థులకు మట్టి నమూనాలు తీయ విధానం గురించి వివరించారు ఈ కార్యక్రమంలో పుంగనూరు శివకుమార్ ఏవో లక్ష్మీ ప్రసన్న మండల వ్యవసాయ అధికారి మోహన్ కుమార్ ఎంఈఓ లు కేశవరెడ్డి తిరుమలమ్మ ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయురాలు పరిమళ ఉపాధ్యాయులు అరుంధతి శ్రీలత పూర్ణిమ అమృత కుమార్ ఏఈఓ శివశంకర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు





