నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)పుత్తూరు డివిజన్ పరిధిలోని రామచంద్రాపురం మండలంలోజిల్లా వనరుల కేంద్రం తిరుపతి వారి ఆధ్వర్యంలో భూసార పరీక్ష ఫలితాలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా వరలకేంద్రం సహాయ వ్యవసాయ సంచాలకులు సౌభాగ్య లక్ష్మి మాట్లాడుతూ భూసార పరీక్ష ,భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువుల వాడకం ద్వారా రైతులకు సాగు ఖర్చు తగ్గడమే కాక నేను ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని తద్వారా ఆహార భద్రత మరియు ఆరోగ్య భద్రత పొందపచ్చని తెలియచేశారు రామచంద్రాపురం మండల వ్యవసాయ అధికారి మమత మాట్లాడుతూ రైతులకు తప్పక భూసార పరీక్ష ఫలితాలు ఆధారంగానే పంటలకు ఎరువులను వాడుకోవాలని అది పర్యావరణానికి మేలు చేయడమే కాక నేల ఆరోగ్యమును కూడా కాపాడుతుంది తెలియజేశారు ఖరీఫ్ 2025 లో రైతులు తమ పొలాల్లోని మట్టిని రైతు సేవా కేంద్రాల ద్వారా భూసార పరీక్షకు పంపిన వారందరూ తమకు సంబంధించిన రైతు సేవా కేంద్రాల నుండి తమ యొక్క భూసార పరీక్ష ఫలితాల కార్డులను తప్పక తీసుకొని వాటి ఆధారంగానే ఎరువులను ఎరువుల వాడకం మరియు యాజమాన్య పద్ధతులను చేపట్టాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వరలకేంద్రం తిరుపతికి చెందిన వ్యవసాయ అధికారులు, సిబ్బంది , రామచంద్రపురం మండల రైతు సేవా కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.




