నేటి సాక్షి తిరుపతి *పలమనేరు*భూ భద్రత కల్పించడం కోసమే రాజ ముద్రతో కూడిన పట్టాదారు పొస్ పుస్తకాలను లబ్ది దారులకు కూటమి ప్రభుత్వం పంపిణీకి చేస్తోందనీ..,ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధికి నిదర్శనం అని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కొనియాడారు. పారదర్శకతతో కూడిన పట్టాదారు పొస్ పుస్తకాలను అందించడం పై అధికారులు దృష్టి సారించి, భూ యజమానులకు ఎటువంటి ఎటువంటి సమస్యకు తావులేకుండా చూడాలని వారు సూచించారు. లబ్దిదారులకు సర్వహక్కులు కల్పిస్తూ.., గత వైకాపా ప్రభుత్వం హయాంలో పట్టాదారు పొస్ పుస్తకాల పై ఉన్న మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోను తీసి వేయించి, మంచి పని చేసిందన్నారు. అంతేకాకుండా భూమి పై ప్రజలకు సర్వహక్కులను కల్పిస్తూ పట్టాదారు పుస్తకాలకు రూపకల్పన చేయడం అభినందించదగ్గ విషయమన్నారు.పలమనేరు నియోజకవర్గం, పెద్దపంజాణి మండలం, పెద్దవెలగటూరులో నిర్వహించిన రాజముద్రతతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై, లబ్ధిదారులకు రాజ్యముద్రతో కూడిన పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉన్నత ఆశయంతో రూపకల్పన చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు.గత వైకాపా ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆస్తులకు సంబంధించిన పట్టాదారు పాస పుస్తకాల పై తన ఫోటో ముద్రించుకొని భూములను కాజేయాలని చూశారని, అయితే ప్రజలు జగన్మోహన్ రెడ్డికి గట్టి గుణపాఠం చెప్పి, కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు భూ భద్రత కల్పిస్తూ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం అందిస్తుందన్నారు.పట్టాదారు పాస్ పుస్తకాలలో ఏదైనా సమస్య ఉన్నా, ఈ సబ్బులు ఆ సమస్యకు పరిష్కారం మార్గాన్ని కూడా చూపే దిశగా అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు.మరి ముఖ్యంగా అధికారులు పట్టాదారు పాస్ పుస్తకాలలో తప్పులకు అవకాశం లేకుండా పారదర్శకతతో కూడిన పట్టాదారు పొస్ పుస్తకాలను సిద్ధం చేసి లబ్ధిదారులకు అందించాలని ఎంపీ, ఎమ్మెల్యేలు ఆదేశించారు. ఈ విషయంలో అధికారులు అలసత్వం వహిస్తే..ప్రభుత్వానికి అపఖ్యాతి వచ్చే ప్రమాదం ఉందని, ఈ విషయాన్ని అధికారులు గుర్తుతెరిగి తమ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించాలని తెలియజేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతున్న కూటమి ప్రభుత్వాన్ని ఆదరించి,ఆశ్శీర్వదించాలనీ వారు కోరారు.ఈ కార్యక్రమంలో పెద్ద పంజాణీ మండలం కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, లబ్దిదారులు, ప్రజలు పాల్గొన్నారు.

