బుగ్గారం పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేయడంఅభినందనీయంనేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి
( గుండ ప్రశాంత్ గౌడ్ )రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భూ భారతి చట్టం మూలంగా గత కొన్నేళ్లుగా రైతులు ఎదురకొంటున్న సమస్యలకు పరిష్కారం లభించునుందని జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్ అన్నారు.ఆదివారం సుభాష్ బుగ్గారం లో మాట్లాడుతూ బుగ్గారం మండలాన్ని భూ భారతి చట్టం పైలెట్ ప్రాజెక్ట్ గా ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల రైతుల పక్షాన ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూ భారతి చట్టం అమలు విషయంలో ధర్మపురి నియోజకవర్గంలోనే బుగ్గారం మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకోవడం అభినందనియామన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లకు అదేవిధంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కు సుభాష్ కృతజ్ఞతలు తెలియజేశారు. గత ప్రభుత్వంలో ప్రవేశ పెట్టిన ధరణి కారణంగా వేలాది మంది రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందని,అట్టి సమస్యలను పరిష్కరించాలని ఉద్దేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూ భారతి చట్టం అమలులోకి తీసుకురావడం జరిగిందన్నారు.పైలెట్ ప్రాజెక్ట్ కింద బుగ్గారం మండలం ఎంపికైన సందర్బంగా రెవెన్యూ అధికారులు అన్ని గ్రామాల్లో సధస్సులు నిర్వహిస్తారని వాటికీ రైతులు పెద్ద ఎత్తున హాజరై సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సుభాష్ రైతులకు సూచించారు.

