నేటి సాక్షి – కోరుట్ల*కోరుట్ల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల వేదికగా మండల స్థాయి భౌతిక శాస్త్ర స్కూల్ కాంప్లెక్స్ సమావేశం సోమవారం నిర్వహించారు.కోరుట్ల, కథలాపూర్ మండలాలకు చెందిన ఉన్నత పాఠశాలల ఫిజిక్స్ ఉపాధ్యాయులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వి. గంగాధర్ మాట్లాడుతూ, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు విద్యార్థులకు కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి ఆధునిక సాంకేతిక అంశాలపై పట్టు సాధించేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు కంప్యూటర్ లిటరసీపై సమగ్ర అవగాహన కలిగి ఉండేలా ఉపాధ్యాయులు శిక్షణ అందించాల్సిన అవసరం ఉందన్నారు.అలాగే ప్రతి విద్యార్థిపై ప్రత్యేక చొరవ చూపుతూ వారి సామర్థ్యాలను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ కె. రాజ్‌కుమార్, చ. నాగరాజు, సీఆర్‌పీలు పి. గంగాధర్, జ్యోతి తదితరులు పాల్గొంటున్నారు.___

