నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి.శ్రీకాంత్)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని మంఖల్ గ్రామంలో జరిగిన శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,టీపీసీసీ సభ్యుడు దేప భాస్కర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ శివగల్ల యాదయ్య,నాయకులు భాస్కర్ రెడ్డి,శ్రీకర్ గౌడ్,రాజు నాయక్,మహేష్,కప్పల రాజు,సల్మాన్ రాజు,దేవేందర్,జై సూర్య,బాట రాజు తదితరులు పాల్గొన్నారు.