నేటి సాక్షి,నారాయణపేట, డిసెంబర్ 27,పేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలోని స్థానిక బీసీ కాలనీలో గత కొంతకాలంగా కాలనీవాసులు తీవ్ర నీటి కొరత తో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇట్టి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ 3వ వార్డు సభ్యులు,ఇన్చార్జ్ పోలేమోని రామకృష్ణ,సూర్యచంద్ర పౌండేషన్ అధినేత, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్. సూర్య మోహన్ రెడ్డి మరియు గ్రామ సర్పంచ్ చెన్నయ్య గార్ల దృష్టికి తీసుకెళ్లడం జరిగినది. ఈ సందర్భంగా సూర్యచంద్ర పౌండేషన్ అదినేత తక్షణమే స్పందించి అక్కడ ఉన్నటువంటి బోర్ పంపు, మోటార్ పైపును కొత్తవి తెప్పించి, రిపేర్ చేయించి శనివారం సర్పంచ్ ఉపసర్పంచ్ కాజా, మరికల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల, బీసీ కాలనీవాసుల ఆధ్వర్యంలో బోరు వినియోగంలోకి తీసుకురావడం జరిగినది. ఈ సందర్భంగా బీసీ కాలనీవాసులు నీటి కొరతను తీర్చినందుకు గాను ఆనందం వ్యక్తపరుస్తూ, సూర్యచంద్ర పౌండేషన్ అధినేత, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్. సూర్య మోహన్ రెడ్డి గారిని మరియు సర్పంచ్ గూపచెన్నయ్య గారిని ఉప సర్పంచ్ ఖాజా గారిని , మండల కాంగ్రెస్ పార్టీ నాయకులను, బీసీ కాలనీవాసులు శాలువాలతో సన్మానించడం జరిగినది.

