నేటి సాక్షి నారాయణపేట, డిసెంబర్ 31,( ఇమామ్ సాబ్ ), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని కనుమనూరు గ్రామంలో ప్రజలకు తాగునీరు ఇబ్బంది కలగకుండా గ్రామంలో ఉన్న చెడిపోయిన రెండు బోర్లను గ్రామ సర్పంచ్ అంకిత సురేందర్ గౌడ్, గ్రామ ఉప సర్పంచ్ రవికుమార్ రెడ్డి ల ఆధ్వర్యంలో రిపేర్ చేయించడం జరిగింది. దీంతో గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం చేయబడింది. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు గ్రామ యువకులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

