Monday, March 16, 2026

*మండలం కేంద్రంలో ఘనంగా సిపిఐ శత జయంతి ఉత్సవాలు**

నేటి సాక్షి,గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్):*గన్నేరువరంలొ సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ళ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో పార్టీ పతాకాన్ని సిపిఐ గన్నేరువరం మండల కార్యదర్శి కామ్రేడ్ చొక్కల్లా శ్రీశైలం ఎగురావేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న సిపిఐ నాయకులు. ఈ సందర్బంగా శ్రీశైలం మట్లాడుతు సిపిఐ 100 సంవత్సరాల చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటాన్నీ నడిపించింది అన్నారు. ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేస్తూ నిస్వార్థాంగ పోరాడినా చరిత్ర సీపీఐ పార్టీ అని అన్నారు. సీపీఐ పార్టి వరసత్వాన్నీ ఘనంగా ముందుకు తీసుకుపోతామణి రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలొ జిల్లా కౌన్సిల్ సభ్యులు కాంతలా అంజిరెడ్డి మండల సహాయ కార్యదర్శి కూన మల్లయ్య అఖిల భారత విద్యార్ధి సమాఖ్య మండల కార్యదర్శి ముల్కల పవన్ గన్నేరువారం గ్రామ కార్యదర్శి బోయిని మల్లయ్య ఖాసీంపేట్ గ్రామ కార్యదర్శి నాగయ్య మాధపూర్ గ్రామ కార్యదర్శిగాజుల లక్సమన్ గ్రామ సహాయ కార్యదర్శులు బొమ్మకంటి అంజయ్య చారి ఎండీ నయీమ్ న్యత కొమురయ్య జాలి గోపయ్య కళ్లెం పోచయ్య తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News