నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి డిసెంబర్ 17పుంగనూరు నియోజవర్గం చౌడేపల్లి మండలంలోని మండల వనరుల కేంద్రం, పాతబడిపోవడంతో నూతన భవనం నిర్మాణం కొరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారి కార్యాలయ ఆవరణంలో నూతన భవనానికి బుదవారం భూమిపూజ చేశారు. ఈ సందర్బంగా మండల విద్యాశాఖ అధికారి కేశవరెడ్డి మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట ఉండటం వలన పరిపాలనా సౌలభ్యం బాగుంటుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి లీలామాధురి, మడల విద్యాశాఖాధికారిణి తిరుమలమ్మ,నాయకులు ఆవుల రామచంద్ర,పవన్,చిన్నరెడ్డెప్ప, ఉపాద్యాయబృదం పాల్గొన్నారు.





