*నేటి సాక్షి, గన్నేరువరం, ( బుర్ర అంజయ్య గౌడ్):* గన్నేరువరం మండల కేంద్రంలో శనివారం రోజున కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. రేవంత్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ అనంతరం వారు మాట్లాడారు. ప్రజా సమస్యల పైన ప్రాజెక్టులు,నీటిపారుదల, వ్యవసాయ రంగాల మరియు సన్న బియ్యం తో పేదల కడుపు నింపుతున్న రేవంత్ రెడ్డికి పేదల ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రాపోలు నవీన్, మాతంగి అనిల్, మైసంపల్లి తిరుపతి, బుర్ర మల్లేశం గౌడ్, బూర వెంకటేశ్వర్లు, న్యాత జీవన్, కవ్వంపల్లి రాజయ్య ,పాకాల పరశురాం, వెదిరే విజేందర్, ఏలేటి సతీష్ రెడ్డి, మంగరాపు అనిల్,హరీష్, రంగనవేణి సతీష్, న్యాత శ్రీనివాస్, బుర్ర రాములు గౌడ్, ఇక్కుర్తి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.





