Wednesday, March 4, 2026

*మండల కేంద్రమైన పాములపాడులో అరకు కాఫీ, ఎగ్ కార్ట్ క్యాంటీన్లను ప్రారంభించిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య* *.

నేటి సాక్షి 02 మార్చి పాములపాడు:- మండల కేంద్రమైన పాములపాడులో ఈరోజు మార్చి-1వ తేదీన ఉదయం 09:00 గంటలకు నందికొట్కూరు నియోజవర్గం శాసనసభ్యులు గిత్త.జయసూర్య, మన నంద్యాల జిల్లా డి ఆర్ డి ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వై.బి.శ్రీధర్ రెడ్డి ల ఆధ్వర్యంలో పీఎంఎఫ్ఎంఈ ద్వారా లబ్ధిదారులు సి.సావిత్రమ్మ , భర్త ఆంధ్ర ప్రగతి రైతు సేవా సహకార పరపతి సంఘం చైర్మన్ సి.గోవిందు ల “” అరకు కాఫీ (హోటల్) క్యాంటీన్”” ను మరియు “” లబ్ధిదారులు జి.రూపాబాయి, భర్త పరమేశ్వర రావు ల ఎగ్ కార్ట్ క్యాంటీన్లను రిబ్బన్ కటింగ్ చేసి, ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, టిడిపి సీనియర్ నాయకుడు మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి తదితర వక్తలు మాట్లాడుతూ ఈ క్యాంటీన్లో మన అరకులోయ ప్రాంతాల్లో రైతులు పండించిన స్వచ్ఛమైన కాఫీ గింజలతో, తేయాకుతో రకరకాల కాఫీలు, టీలు తయారుచేసి ఇస్తారన్నారు. మరియు టీ, కాఫీ పొడి ప్యాకెట్లు, ఐస్ క్రీములు, తదితర వాటిని విక్రయించడం కూడా జరుగుతుందన్నారు. అదేవిధంగా ఎగ్ కార్ట్ పాయింట్లు రకరకాల ఫ్రైలు, చపాతీలు తయారు చేసి ఇవ్వడం జరుగుతుందన్నారు. నిత్యజీవితంలో మనిషి ప్రతిరోజు ఎన్నో బాధలతో, ఎంతో టెన్షన్తో, రకరకాల ఆలోచనలతో ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని, కనుక అందరూ కాసేపు ఈ అరకు కాఫీ కేఫ్ లో కూర్చొని రిలాక్స్ గా తాగి ప్రశాంతతను, మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & కన్వీనర్ మాండ్ర.సురేంద్ర నాథ్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం.ప్రసాద్ రెడ్డి, పాములపాడు మండల కన్వీనర్ జి.రవీంద్రనాథ్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి జి.హరిప్రసాద్ యాదవ్, తెలుగు యువత మండల అధ్యక్షుడు షేక్.కరీం బాషా, బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం.మోహన్ గౌడ్, పాములపాడు మండల టిడిపి నాయకులు తిమ్మా రెడ్డి, భానుముక్కల బండ్లమూరి వెంకటేశ్వరరావు, బండ్లమూరి మహేష్, కృష్ణ, వెంకటేశ్వర రెడ్డి, సురేష్, నాయిని.మధు, నాయిని ఉపేంద్ర, పూసల కృష్ణ, ప్రసాద్, హరినాథ్ రెడ్డి, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ మెంబర్ లింగాల నాగరాజు, జిల్లా డి.పి.ఎమ్ యాంకర్ పర్సన్ సురేష్, జూటూరు హాఫీస్, ఆదిరెడ్డి, బానుముక్కల బల్లమూరి చంద్రశేఖర్, పాములపాడు ఎం.రాజశేఖర్, గ్రామ సంఘం ప్రతినిధులు భూమా రాములమ్మ , ప్రాజెక్టు సిబ్బంది సీసీలు ఎం.నాగన్న, వి.కృష్ణారెడ్డి, జి.వెంకటరాముడు మరియు వివోఏలు, పోలీస్ సిబ్బంది, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News