నేటి సాక్షి చిలుకూరు సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర మండల స్థాయి ప్రతిభ పరీక్షను నిర్వహించారు.ఈ ప్రతిభ పరీక్షలో ఇంగ్లీష్ మీడియం నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిలుకూరు చెందిన విద్యార్థులు బానోతు ఐశ్వర్య ప్రథమ స్థానం, బాలబోయిన శ్రీరామ్ ద్వితీయ స్థానం, అదేవిధంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆచార్యుల గూడెం విద్యార్థిని ముసి నవ్య శ్రీ తృతీయ స్థానం సాధించారు. తెలుగు మీడియం నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిలుకూరు కు చెందిన ఎం వెంకట గోపి ప్రధమ స్థానం, కే వర్షిత ద్వితీయ స్థానం మరియు ఎం నందిని తృతీయ స్థానం సాధించినారు, ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ కరుణాకర్ రెడ్డి , పొదిల సైదయ్య . సత్యం, ఏ లెనిన్, సిహెచ్ వెంకటేశ్వర్లు, పి వీరస్వామి, ఎం రవి, కె వెంకన్న, కె కృష్ణ, కె అశోక్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

