నేటి సాక్షి, ధర్మారం (అక్టోబర్ 23) : తుంగతుర్తి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ధర్మారం మండలం కొత్తూరు గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం కాంగ్రెస్ శ్రేణులు ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కాంపెల్లి పోచయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు గాదరి కిషోర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి అడ్లూరికి గాదరి కిషోర్ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ నాయకులు ఆయనకు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘం మాజీ చైర్మన్ చొప్పదండి మల్లేశం, పార్టీ నాయకులు కొక్కుల రామనారాయణ, గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మేకల కుమార్, మీనుగు స్వామి, మీనుగు రమేష్, నెరువట్ల మల్లేశం, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





