Friday, March 20, 2026

*మంత్రి వివేక్ వెంకటస్వామి గారి సహకారం తో 8వ వార్డు తిమ్మాపూర్ లో ఈ సీజన్లో 3వ సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి, హర్షం వ్యక్తం చేసిన కాలనీ వాసులు*

నేటి సాక్షి మార్చి 20 (మంచిర్యాల్) శ్రీధర్ దమ్మ మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎనిమిదవ వార్డు తిమ్మాపూర్ విలేజ్ రోడ్డు కి అనుకోని వున్న కాలనీ కి కనెక్టింగ్ రోడ్డు 5 లక్షల TUFIDC నిధులతో 12 ఫీట్ల వెడల్పు తో సుమారు 60 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి చేయటం జరిగింది. 2019 నుంచి నిర్మించుకున్న ఈ కాలనీ బిల్డింగ్ వాసులకు సరైన రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు పడేవారు, ఇన్ని సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గౌరవ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారి చొరవతో సీసీ రోడ్డు నిర్మితమైనందుకు కాలనీవాసులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు పందిరి లింగయ్య, అనవేనా సతీష్, గట్టు నవీన్, సంజీవ రెడ్డి, యాదగిరి తిరుపతి మరియు కుర్మా సురేందర్ తదితరులు కాలనీ వాసులు రామారావు, శ్రీనివాసు, భీమా నగేష్ సమక్షంలో సీసీ రోడ్డు నిర్మితమైనందున కొబ్బరి కాయలు కొట్టి మంత్రి గారికి కృతజ్ఞతలు తెలిపారు.*మంత్రి గారి హయాంలో ఎలాంటి అభివృద్ధి పనులను అయిన చేపించటానికి మా వంతూ ప్రయత్నం ఎప్పటికి ఉంటుందని వార్డు ప్రజలకు తెలియపరుస్తున్నాము*

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News