నేటి సాక్షి, కరీంనగర్: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు జన్మదిన వేడుకలను గురువారం కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. కరీంనగర్‌లోని ఇందిరా చౌక్ వద్ద నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న శ్రీధర్‌బాబు.. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా వారి పదవికి వన్నె తెచ్చేలా కృషి చేస్తున్నారని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. కీర్తి కుమార్, కొట్టే ప్రభాకర్ ఆధ్వర్యంలో కార్ఖానగడ్డ వృద్ధాశ్రమంలో బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. అబ్దుల్ రెహమాన్, లయక్ ఖాద్రీ, మతీన్ ఆధ్వర్యంలో ఖరీముల్లాషా దర్గాలో చాదర్ సమర్పించి, ప్రార్థనలు చేశారు. పోతారపు సురేందర్ ఆధ్వర్యంలో మాతాశిశు ఆసుపత్రిలో అల్పాహారం, టవర్ సర్కిల్ వద్ద సల్ల ప్యాకెట్ల పంపిణీ చేశారు. మారంపల్లి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో శాతవాహన యునివర్సిటీ వద్ద కేక్ కట్ చేశారు. నాకా చౌరస్తా వద్ద ఖమరుద్దీన్, బషీర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, ఎండీ తాజ్, శ్రవణ్ నాయక్, ఆకారపు భాస్కర్‌రెడ్డి, ఎండీ చాంద్, సమద్ నవాబ్, గుండాటి శ్రీనివాస్‌రెడ్డి, జీడి రమేశ్, కర్ర రాజశేఖర్, బత్తినీ చంద్రయ్య, దీకొండ శేఖర్, షబానా మహమ్మద్, ముల్కల కవిత, జ్యోతిరెడ్డి, తిరుమల, హసీనా, మెతుకు కాంతయ్య, కుర్ర పోచయ్య, శేహెన్ష, నిహాల్ అహ్మద్, ఇమ్రాన్, అష్రఫ్, రాజ్‌కుమార్, మంద మహేశ్, యోన, హనీఫ్, అజయ్, మిరాజ్, పెద్దిగారి తిరుపతి, మామిడి సత్యనారాయణరెడ్డి, సతీష్ రావు, భరత్ తదితరులు పాల్గొన్నారు.