నేటి సాక్షిమందమర్రి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో నూతనంగా ప్రవేశపెట్టిన బస్ ను ప్రారంభించిన కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ప్రజా రవాణా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామాలు, పట్టణాలను అనుసంధానించే విధంగా ఆర్టీసీ సేవలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఈ నూతన బస్ సేవతో మందమర్రి, రామకృష్ణపూర్ పరిసర ప్రాంతాల ప్రజలకు జిల్లా కేంద్రం మంచిర్యాలకు వెళ్లే ప్రయాణం మరింత మెరుగు పడుతుంది అన్నారు,ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రవాణా సౌకర్యాల అభివృద్ధికి జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు.కార్యక్రమంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు, జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

