నేటి సాక్షి,నారాయణపేట, ఫిబ్రవరి 20 (రిపోర్టర్ ఇమామ్ సాబ్ ) నారాయణపేట జిల్లాలోని మక్తల్ మున్సిపల్ చైర్ పర్సన్ గా వాకిటి మానస హన్మంతు, వైస్ చైర్ పర్సన్ గా కుమారి శైవీ రెడ్డి ల పదవీ భాద్యతల స్వీకరణ కార్యక్రమానికి రాష్ట్ర క్రీడా,యువజన సర్వీసులు,పాడి పరిశ్రమ, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి గారు, సతీమణి లలిత హాజరయ్యారు. కార్యాలయంలో పూజల అనంతరం ఇరువురినీ వారి కుర్చీలల్లో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలరాజు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

