నేటి సాక్షి, బెజ్జంకి: మండలంలోని చీలాపూర్ పల్లె నుండి బెజ్జంకి కి అక్రమంగా మట్టి తరలిస్తున్న మూడు టిప్పర్లను, జెసిబీని సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారులు మంగళవారం రాత్రి పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అలాగే గాగిల్లాపూర్ శివారులోని మోయ తుమ్మెద వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను పోలీసులు పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.