నేటి సాక్షి, మధిర: యువత మత్తు పదార్థాలు, గంజాయికి దూరంగా ఉండాలని మధిర రూరల్ ఎస్సై లక్ష్మీ భార్గవి సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం కారణంగా యువత జీవితాలు దుర్భరమవుతున్నాయని అన్నారు. మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారని అన్నారు. గంజాయిపై ఉక్కు పాదం మోపుతామని హెచ్చరించారు. ఇప్పటికే బృందాలుగా ఏర్పడి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గంజాయి రహిత మండలంగా చేయాలన్నదే తమ ధ్యేయమని అన్నారు. గంజాయికి బానిసలుగా మారి, యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకొంటుందని, దాని వల్ల తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడేవారి సమాచారాన్ని ఇవ్వాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లు గొప్యంగా ఉంచుతామని అన్నారు. గంజాయి రహిత మధిర కోసం కృషి చేస్తామన్నారు.