నేటి సాక్షి, నారాయణపేట, జూన్ 21,
తెలంగాణ రాష్ట్రాన్ని మత్తు పదార్థాల రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు యాంటీ నార్కోటిక్ బ్యూరో వింగ్ వారి ఆదేశాల మేరకు నషా ముక్త్ భారత్,యాంటీ డ్రగ్ దినోత్సవం జూన్ 26 ఉన్నందున యాంటీ డ్రగ్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు డీఎస్పీ ఎన్ లింగయ్య ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల విద్యార్థులకు ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన డ్రగ్స్ మరియు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్ధాలపై నారాయణపేట డిఎస్పి ఎన్ లింగయ్య యాంటీ నార్కోటిక్ బ్యూరో డిఎస్పి బుచ్చయ్య లు విద్యార్థులతో మాట్లాడి మత్తు పదార్థాల వినియోగం వలన కలుగు నష్టాల పై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డీఎస్పీలు మాట్లాడుతూ…. రాష్ట్రవ్యాప్తంగా నషా ముక్త్ భారత్, యాంటీ డ్రగ్ అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొంతమంది వ్యక్తులు యువతను లక్ష్యంగా చేసుకొని గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను అమ్ముతూ బానిసలుగా మారుస్తు యువత భవిష్యత్తు నాశనం చేస్తున్నారన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ సూచించారు. చిన్న వయసులోనే అవగాహన కల్పించడం ద్వారా విద్యార్థులు మత్తు పదార్థాలు, గంజాయి వంటి వాటికి
దూరంగా ఉంటారన్నారు. ఎవరైనా మత్తు పదార్థాలు అమ్మిన, సరఫరా చేసిన, సేవించిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సందర్భంగా విద్యార్థులు అధికారుల తో కలిసి మాదక ద్రవ్యాలు, గంజాయి వాడకంపై పోస్టర్లను ఆవిష్కరించారు. ఐయామ్ ఆన్ యాంటీ డ్రగ్ సోల్జర్ గా సుమారు 180 మంది విద్యార్థులను ఎన్రోల్ చేయడం జరిగిందని డిఎస్పి తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీఐ శివ శంకర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది, స్కూల్ టీచర్స్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

