Saturday, March 21, 2026

మదనపల్లి డివిజన్లోని 11 మండలాల్లో భూ రీ సర్వే..సబ్ కలెక్టర్ – చల్లా కళ్యాణి

నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 04 ~అన్నమయ్య జిల్లా :-: మదనపల్లి డివిజన్ లోని 11 మండలాల్లో మూడు విడతలుగా భూ రీ సర్వే కొనసాగుతుందని సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి తెలిపారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీ సర్వే మదనపల్లి డివిజన్ లోని 11 మండలాల్లోని 156 గ్రామాలలో చేపట్టడం జరిగిందన్నారు. మొదటి విడతలో మొత్తం 64 గ్రామాలలో మండలానికి ఒక గ్రామం చొప్పున భూ రీ సర్వే పూర్తి చేసి, వెబ్ ల్యాండ్ కు సిపార్స్ చేశామని సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి చెప్పారు. ఉన్నతాధికారులు ఆన్లైన్ కు అనుమతిస్తే రైతులకు సంబంధించిన భూమి వివరాలు ఆన్లైన్ లోనే వన్ బి, అడంగల్ కనిపిస్తుందని చల్లా కళ్యాణి తెలిపారు..~~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News